జమ్ముకాశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ (CLiC2NEWS): జమ్ముకాశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు వీరిని హతమార్చారు. మరణించిన వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పనిచేస్తున్నాడని అధికారులు వెల్లడించారు. షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారం ఆధారంగా సైన్యంతో కలిసి కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మృతులలో లష్కరే తొయిబా కోసం పనిచేస్తున్న పాకిస్థానీ ఉగ్రవాది ఉన్నట్లు ఐజి విజయ్ కుమార్ వెల్లడించారు.