పిడుగురాళ్లలో డయోరియాతో వారం రోజుల్లో నలుగురి మృతి
పిడుగురాళ్ల (CLiC2NEWS): అతిసార వ్యాధితో వారం రోజుల్లో 45 కేసులు నమోదవ్వగా నలుగురు మృతి చెందారు. దీంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమవ్వటం ద్వారా వ్యాధులు ప్రబలుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతాలైన లెనిన్ నగర్, మారుతీ నగర్‌లలో అతిసార బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు తిరుపతిలో కూడా డయోరియాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.