ఆర్కే బీచ్‌లో నలుగురు వ్యక్తులు గల్లంతు..

విశాఖపట్టణం (CLiC2NEWS): విశాఖ ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్కేబీచ్‌లో 8 మంది యువకులు స్నానానికి వెళ్లగా నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన యువకులు బీచ్‌లో స్నానానికి దిగగా.. పెద్ద కెరటం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. గజఈతగాళ్లు, లైఫ్ గార్డ్స్ గాలింపు చర్యలు చేపట్టారు.