సెల్ఫీ తీసుకుంటూ నలుగురు యువకులు మృతి..

రైల్వే వంతెన వద్ద సెల్ఫీ తీసుకుంటున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైనారు.
హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన వద్ద మంగళవారం రాత్రి సెల్ఫీ తీసుకుంటుండగా .. రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారంతా 18 నుండి 21 సంవత్సరములలోపు వారని రైల్వే పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు విద్యార్థి, మిగిలిన ముగ్గురు మొబైల్ షాప్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలు ప్రమాదాలుగా పరిగణించడంలేదని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.