మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి
అమరావతి (CLiC2NEWS): తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అమరాతి జిల్లా చికల్‌దరా వద్ద ఘాట్‌రోడ్‌లో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారు నల్గొండ, ఆదిలాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.