అమెరికాలో నకిలి కంపెనీలు సృష్టించి..
వెట్టిచాకిరి చేయించుకుంటున్న నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
అమెరికాలో నకిలి కంపెనీలు సృష్టించి కొంతమంది తో బలవంతంగా పని చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు తెలుగు వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. గిన్స్బర్గ్ లేన్, ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లో బాధితులను పోలీసులు గుర్తించారు. దాదాపు 100 మందికి పైగా పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.
అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు సాగిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ కార్మికుడు ఆపార్ట్మెంట్లో చాలామంది పనిచేస్తుండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ ఏడాది మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సిఐడి విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపారు. అక్కడ మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు గుర్తించారు. సంతోష్ , ద్వారక తో పాటు చందన్, దాసిరెడ్డి, అనిల్ మాలె వీరికి సహకరించినట్లు తేలడంతో ఈ నలుగురిపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.