హిమాలయాల్లో చిక్కుకుపోయిన 18 మంది పర్యాటకులు.. నలుగురు మృతి

ఉత్తర్కాశి (CLiC2NEWS): హియాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన 22 మంది పర్వతారోహకుల బృందం ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిలో నలుగురు మృతి చెందినట్లు ఉత్తర్కాశి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వీరంతా కార్ణాటకకు చెందినవారు. ఒకరు మాత్రం మహారాష్ట్ర నుండి వచ్చినట్లు సమాచారం. వీరితోపాటు స్థానిక గైడ్లు తోడుగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ పర్వతారోహకుల బృందం మే 29వ తేదీన 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్త్రతాల్ సరస్సుకు బయలుదేరింది. వీరంతా ఈ నెల 7వ తేదీన తిరిగి రావలసి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా దారితప్పినట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు చనిపోగా మిగిలిన వారు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.