సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం!

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్ ఏరియా ఎస్ ఆర్పీ-3 గ‌నిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సింగరేణి గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో చోటుచేసుకున్న ప్ర‌మాదంలో గ‌నిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పైకప్పు కూలింది. ఇవాళ మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మైన్‌లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్‌ 24 లెవెల్‌ వద్ద రూఫ్‌ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు.  మృతులు కృష్ణారెడ్డి(59), లక్ష్మయ్య(60), చంద్రశేఖర్‌(29), నర్సింహరాజు‍‌(30)గా గుర్తించారు.

కాగా సింగ‌రేణి అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌ ఇబ్బందిగా మారింది. మరో రెండు గంటల సమయం పట్టవచ్చని కార్మికులు చెబుతున్నారు. కాగా ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.