బిహార్ రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో కూలిన నాల్గవ వంతెన..
ఆందోళనలో ప్రజలు

పట్నా (CLiC2NEWS): బిహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కుంగిపోతున్నాయి. ఇప్పటి వరకు మూడు వంతెనలు కుంగిపోగా.. తాజాగా నాల్గవ వంతెన కిషన్‌గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన వంతెన కుంగిపోయింది. దీంతో బహదుర్‌గంజ్, దిఘాల్‌బ్యాంక్ బ్లాక్ ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల వ్యవధిలో ఇది నాల్గవ ఘటన కావడం గమనార్హం. అంతకు ముందు తూర్పు పంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెనలు కుంగిపోయినవి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంకయీ ఉపనదిపై నిర్మించిన వంతెన 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 2011లో నిర్మించారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నది నీటి మట్టం పెరిగి వంతెన పిల్లర్లు కుంగిపోయినట్లు సమాచారం.
