భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతు పలికిన ప్రాన్స్!

UNSC: మారుతున్నకాలానికి అనుగుణంగా భద్రతా మండలి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని.. భారత్ వంటి దేశాలకు కచ్చితంగా స్థానం కల్పించాలని ఫ్రాన్స్ సూచించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కొరకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఫ్రాన్స్ కూడా తన మద్దతును తెలిపింది. భద్రతా మండలి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలం.. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌లకు శాశ్వత సభ్యత్వం ఉండాలి. ఆప్రికా నుండి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతామండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్న విషయం తెలిసిందే.