హైద‌రాబాద్ నుండి వ‌చ్చే ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి పొడిగింపు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ నుండి ఎపిలోని అమ‌రాతికి వ‌చ్చి ప‌నిచేస్తున్న ఉద్యోగుల ఉచిత వ‌స‌తి స‌దుపాయాన్ని మ‌రో రెండు నెల‌ల పాటు పొడిగించింది. ఈమేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మే 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఈ ఉచిత వ‌స‌తి స‌దుపాయాన్ని పొడిగిస్తున్న‌ట్లు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఉద్యోగ సంఘాల నుండి వ‌స్తున్న విజ్ఞ‌ప్తుల మేర‌కు మ‌రో రెండు నెల‌ల‌పాటు ఈ స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది. ఎపి స‌చివాల‌యం, శాస‌న‌స‌భ‌, హెచ్ ఓడి కార్యాల‌యాలు, హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే ఈ పొడిగింపు వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.