రాష్ట్ర మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర మ‌హిళ‌ల‌కు కొత్త స‌ర్కార్ శ‌భ‌వార్త‌నందించింది. రేపు మ‌ధ్యాహ్నం నుండి మ‌హిళ‌లు ఆర్‌టిసి బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌య‌ణించ‌వ‌చ్చు. రాష్ట్రంలోని బాలిక‌లు, మ‌హిళ‌లు, ట్రాన్స్ జెండ‌ర్లకు ఈ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేర‌కు మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించ‌నున్న‌ట్లు శుక్ర‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.శ‌నివారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు అసెంబ్లీ ప్రాంగ‌ణం నుండి ఈ ప‌థ‌కం ప్రారంభించ‌నున్నారు. దీని వ‌ల్ల ఆర్టిసిపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. అయితే మ‌హిళా ప్ర‌యాణికుల ఛార్జి మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్‌టిసికి చెల్లిస్తుంద‌ని తెలిపారు.

మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయాల‌ని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనిక‌నుగుణంగా ఆర్టిసి ఎండి స‌జ్జ‌నార్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డించారు. ప‌ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటి ఆర్డిన‌రీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో మ‌హిళ‌లు రాష్ట్ర స‌రిహ‌ద్దు వ‌ర‌కు ఎక్క‌డి నుండి ఎక్క‌డికైనా ప్ర‌యాణించ‌వ‌చ్చు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానిక‌త ధ్రువీక‌ర‌ణ గుర్తింపు కార్డు చూపిస్తే స‌రిపోతుంది. ప్ర‌యాణ స‌మ‌యంలో మ‌హిళా ప్ర‌యాణికుల‌కు జీరో టికెట్ ఇస్తారు. ప్ర‌స్తుతం 7,200 స‌ర్వీసులు రాష్ట్రంలో ఈ ప‌థాకానికి అందుబాటులో ఉన్న‌ట్లు స‌జ్జ‌నార్ తెలిపారు. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.