వారం రోజుల్లో ఫ్రీ క‌రెంట్‌, రూ. 500కే గ్యాస్ సిలిండ‌ర్: సిఎం రేవంత్ రెడ్డి

కొడంగ‌ల్ (CLiC2NEWS): రానున్న వారం రోజుల్లో ఫ్రీ క‌రెంట్, రూ. 500 కే గ్యాస్ సిలిండ‌ర్ అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అంతేకాక రైతుల‌కు రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫి చేసే బాధ్య‌త తీసుకుంటాన‌ని స్ఫ‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన తర్వాత మొద‌టిసారిగా కొడంగ‌ల్‌లో బుధ‌వారం తొలిసారి ఆయ‌న ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. పాల‌మూరు గ‌డ్డ న‌న్ను ఆద‌రించి, ఆశీర్వ‌దించి అక్కున చేర్చుకుంద‌ని.. కొడంగ‌ల్ ప్ర‌జ‌ల ఆశీర్వాదం వ‌ల్లే సిఎం అయ్యానన్నారు. ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. మార్చి 15న రైతు బంధు, రైతు భ‌రోసా అమ‌లు చేస్తామ‌న్నారు. తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వాడికి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500 కే గ్యాస్ సిలిండ‌ర్ అందిస్తామ‌ని సిఎం ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.