రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: డిప్యూటి సిఎం భట్టి

హైదరాబాద్ (CLiC2NEWS): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువులకు ఈ ప్రభుత్వ ఎంఓ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో సంభవించిన వరద విపత్తు కారణంగా సిఎం ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. ప్రస్తుత కంపెనీల అవసరాకలు అనుగుణంగా మన విద్యాసంస్థలు లేవని.. మన విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్ యూనివర్సి టి ఏర్పాటు చేస్తున్నామని.. ఐటిఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజి సెంటర్లు గా మార్సులు చేస్తున్నట్లు తెలిపారు. సమాజాన్ని సన్మార్గంలో పెట్టడం గురువలది కీలకపాత్ర అన్న ఆయన అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఆదర్శమైన గురువులున్నారన్నారు. గురువులు ఎంత గొప్ప వారైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందని భట్టి విక్రమార్క అన్నారు.