రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి తీసుకున్న మండపాలకు ఉచిత కరెంట్ అందించనున్నారు. ఈ నెల 27న వినాయక చవితి సందర్బంగా హైదరాబాద్ నగరంలో గణేశుడి మండపాలు సిద్దమయ్యాయి. గణేశుడి విగ్రహాలు సైతం మండపాలకు తరలిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ మహా గణేశుడి విగ్రహం సైతం తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి తీసుకున్న గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది.
Crime news: భార్యను ముక్కులగా చేసి మూసీలో పడేసిన భర్త
[…] రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ఫ్రీ… […]