ఉజ్వల యోజన.. దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ..

లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దీపావళి కానుకగా ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ కలనెక్షన్లు ఉన్నవారందరికీ ఈ ఉచిత కానుక అందించనున్నారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కెక్షన్లు పొందిన వారందరికీ సిలిండర్ ధర రూ. 300 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుపిలోని ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బులంద్‌శహార్‌లో రూ. 632 కోట్ల విఉలవైన వివిధ అభివృద్వి పనుకలు మంగళవారం సిఎం శంకుస్థాపన చేశారు.