దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం.. నాదెండ్ల మనోహర్

తెనాలి (CLiC2NEWS): రేషన్ కార్డు దారులకు శుభవార్తం దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు వచ్చాని సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా రేషన్ కార్డుదారులకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.