ఉచితంగా `నందిని`పాలు.. ఉచిత సిలిండర్లు: కన్నడ ప్రజలకు బిజెపి ఎన్నికల హామీలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/karnataka_BJP_election_manifesto.jpg)
బెంగళూరు (CLiC2NEWS): కన్నడ నాట ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఓటర్లకు పలు రకాల `ఉచితాల`ను ప్రకటిస్తున్నాయి.
తాజాగా అక్కడి అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పేదల ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రాష్ట్రంలో ఉమ్మడిపౌరస్మృతి అమలు, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీల వర్షం కురిపించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం కర్ణాటక రాష్ట్ర బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సిఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ నాయకుడు యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు..
- కన్నడ నాట ఉమ్మడి పౌరస్మృతి అమలు
- పది లక్షల ఉద్యోగాలు
- పేదలకు ప్రతిరోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు
- పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణ ధ్యాన్యాలు
దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతీ ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్లు (ఉగాది, వినియక చవితి, దీపావళికి ఒక్కొక్కటి) - మైసూర్‌లోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు
- నిరాశ్రయులకు 10లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు
- వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్‌చెకప్‌లు