2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం: కేంద్ర కేబినేట్ ఆమోదం

ఢిల్లీ (CLiC2NEWS): రేషన్‌కార్డు దారులకు శుభవార్త. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఆహార భద్రలో భాగంగా ఉచితంగా బియ్యం/ ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన తో పాటు సంబంధిత పథకాలను కేంద్ర పొడిగించింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినేట్ నిర్ణతీసుకున్నట్లు సమాచారం. దీని కోసం రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.