ఖమ్మం లో ఉచిత యోగ శిక్షణా తరగతులు
ఖమ్మం (CLiC2NEWS): ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్, శ్రీ మిత్ర ఫౌండేషన్, ఖమ్మం వాకర్ ప్యారడైజ్ వారి ఆధ్వర్యంలో గొరిల్లా పార్క్ ప్రక్కన ఉచితంగా యోగ శిక్షణ శిభిరం నిర్వహించుచున్నారు. ఈ శిక్షణ శిబిరములో యోగా చార్యులు షేక్ బహ అలీ ఆధ్వర్యంలో
యోగ, ప్రాణాయామం,ధ్యానము శిక్షణ ఇవ్వబడును అని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం రేపటి (15-06-2024) నుండి 21 వ తేదీ వరకు వారం రోజులు జరుగుతుంది. ఈనెల 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగ డే కూడా ఈ కార్యక్రమంలో జరుపబడును.కావున ఖమ్మం ప్రజలందరు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయగలరని నిర్వాహకులు కోరారు.