విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి: మంత్రి సబిత

ఆదిలాబాద్ (CLiC2NEWS): బాసర ఆర్జీయు కెటి విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నరవేర్చాలని ఇంఛార్జి విసి వెంకటరమణను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆర్జీయూ కెటి ఇంఛార్జి విసిగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ.. మంత్రి సబితతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్జీయు కెటిలోని పలు సమస్యలపై చర్చించారు. ఇకపై అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బోధన, భోజన, వసతి పరంగా అక్కడి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలకోసం సర్కార్ పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి ఈ సబిత పేర్కొన్నారు.