గగన్‌యాన్ తొలి టెస్టు సక్సెస్
![](https://clic2news.com/wp-content/uploads/2023/10/gaganyan.jpg)
శ్రీహరికోట (షార్) (CLiC2NEWS): గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో తలపెట్టిన తొలి టెస్ట్ వెహికల్ ప్రయోగం విజయవంతమైంది. శాస్త్ర వేత్తలు ప్రయోగించిన క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళఖాతంలో దిగింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ 12.30 గంటలు కొనసాగిన తర్వాత టివి-డి1 నింగిలోకి బయలుదేరాలి. కానీ అది శనివారం ఉదయం 8 గంటలకు చేయాల్సిన ప్రయోగం.. ఉదయం 8.30, 8.45 గంటలకు వాయిదా పడింది. సాంకేతిక లోపాలు సరిదిద్దాక ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి విజయవంతంగా ప్రయాణించింది. షార్‌లో తొలిసారి లిక్విడ్ ఇంజిన్‌తో ఈ ప్రయోగం నిర్వహించారు.
ఈ ప్రయోగంలో 12 కి.మీ ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థ రాకెన్ నుంచి వేరైంది. వాహనం 17 కి.మీ. ఎత్తులో క్రూమాడ్యుల్ విడిపోయాయి.. తర్వాత పారాచూట్లు విచ్చుకోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూమాడ్యుల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగాయి. అనంతరం ఇండియన్ నేవీ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరీక్ష విజయవంతం తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టివి-డి1 ప్రయోగం సక్సెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు. గగన్‌యాన్ సాకారం దిశగా ఈప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందని ప్రధాని పేర్కొన్నారు.