మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు
హైదరాబాద్ (CLiC2NEWS): సాంప్రదాయ ఆటలు ఆరోగ్యానికి బాటలుగా ఉండేవని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, డా.పి.స్వరూప రాణి, గైనకాలజిస్ట్ డా.నాగేశ్వరి, పి.ఒఋల్ రెడ్డి స్కూల్ పిటి టిచర్ అన్నపూర్ణ, డా. క్యార్లిన్, యోగా గురు బి.సరోజని తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ‘8’ సందర్భంగా ఈ పోటీలు డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీలలో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అందజేస్తారని పేర్కొన్నారు. ఈ ఆటలలో పాల్గొనేవారు 9390044031 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుకోవచ్చన్నారు.