బాపూ ఘాట్‌లో ఘనంగా గాంధీ జయంతి

హైదరాబాద్ (CLiC2NEWS): జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై , హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు మహముద్ అలీ, కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎంపిలు కే కేశవరావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జీవన్ రెడ్డి, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.