హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేశ శోభాయాత్ర
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/ganesh.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలో గణేశ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. నగరంలో హుస్సేన్ సాగర్ తో సహా దాదాపు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గణేశుడి నామ స్మరణతో మార్మోగుతున్న హైదరాబాద్ నగర వీధులు. ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు ప్రాంతాలు ఇసుక వేస్తే రాలనంత జనం. ఎటు చూసినా భక్త జన సంద్రం. ఆ ప్రాంతమంతా గణపతి బొప్పా మోరియా, జై గణపయ్య, బైబై గణపయ్య అంటూ మారుమోగుతోంది. భారీ సంఖ్యలో గణనాథులు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్నాయి. నిమజ్జనం కోసం ఇప్పటికే సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలో గణేశ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. కాగా నగరంలోని పాతబస్తీ, సికింద్రాబాద్‌నుంచి భారీగా తరలిస్తున్న వినాయకులు.
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదరుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 1.30 నిమిషాల ప్రాంతంలో హుస్సేన్ సాగర్ జాలాల్లో మహాగణపతి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ సుందర దృష్యాలను చూసేందుకు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. ఖైరతబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసి భారీ క్రెయిన్‌నం. 4 వద్ద మహాగణపతి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. మహాగణపతి నిమజ్జనం చూసేందుకు ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఖైరతాబాద్ మహాణపతి శోభాయాత్ర ఇవాళ (గురువారం) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. చివరకు మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరింది.
కాగా హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం పోలీసు యంత్రాంగం దాదాపు 40 వేల మంది పోలీసులను మోహరించారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. నగరంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
భక్తులంతా ఎంతో ఉత్కంఠతో ఎదరు చూస్తున్న బాలాపూర్ లడ్డు వేళంలో అత్యధిక ధర పలికింది. ఈ సారి తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్‌లో జరిగిన ఈ వేళం పాటలో మొత్తం స్థానికులు 20 మంది సహా మొత్తం 36 మంది లడ్డు కోసం పోటీ పడ్డారు. ఈ వేలం పాట కార్యక్రమంలో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగత కృష్ణారెడ్డితో పాటు పల్గొన్నారు. నిర్వాహకులు ఉత్సవ సమితి రూ. 1,116తో వేలం పాట ప్రారంభించారు.
కాగా లడ్డు వేలం పాట పూర్తి కావడంతో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వినాయకుడిని హుస్సేన్‌సాగర్ తరలిస్తున్నారు. ఈ శోభాయాత్ర చంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్, మెజాంజాహి మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ కు వరకు కొనాసాగుతుంది.
లడ్డు వేలం పాట ప్రారంభించి ఈ యేడాదికి 30 యేళ్లు..
30 ఇయర్స్ గా లడ్డు వేలం పాట కొనసాగుతోంది. తొట్టతొలిసారి ఈ వేలం పాట 1994 లో బాలాపూర్ లడ్డును వేలం లో స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి రూ. 450కి దక్కించుకున్నారు.
తప్పకచదవండి: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి