నకిలీ కాల్‌సెంటర్‌ల ద్వారా మోసాలకు పాల్పడిన ముఠా ఆరెస్ట్
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ క్రెడిట్ కార్డుదారులను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేశారు. వారి నుండి రూ. 1.11కోట్లు , మూడు వాహనాలు, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, 12 సెల్‌ఫోన్లు, 10 సిపియులు, 6 రబ్బర్ స్టాంప్‌లు, 16 చెక్‌బుక్‌లు, 18 డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. ఈమేరకు సిపి కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు.
మొహాలీ, హైదరాబాద్‌కు చెందిన ఏడుగురిని అరెస్టు చేసనట్లు తెలిపారు. ఈ ముఠా 80 మందితో నకిలి కాల్‌సెంటర్‌లు నిర్వహిస్తూ ఇప్పటివరకు రూ. 50 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డుదారుల సమాచారాన్ని సేకరించి, వాటికి ప్రాంచైజీలుగా ఉన్నభారతీయ బ్యాంకులను కొల్లగొట్టారు. ఈముఠాకు చెందిన నవీన్ బొటాని కీలక పాత్ర పోషించాడని తెలిపారు.