Hyderabad: చిన్నారుల‌ను విక్ర‌యిస్తున్న ముఠా అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): చిన్నారుల‌ను ఎత్తుకొచ్చి న‌గ‌రంలో విక్ర‌యిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుజ‌రాత్ నుండి చిన్నారుల‌ను తీసుకొచ్చి హైద‌రాబాద్‌లో విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం అంద‌గా.. మ‌ల్కాజ్‌గిరి ఎస్ఒటి పోలీసులు న‌లుగురు చిన్నారుల‌ను ర‌క్షించారు. 11 మంది నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. పిల్ల‌ల‌ను విక్ర‌యించిన వారితో పాటు వారిని కొనుగోలు చేసిన వారిని సైతం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుండి 11 ఫోన్లు, రూ.5వేల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.