గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు

హైదరాబాద్ (CLiC2NEWS): పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. ట్యంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. 9 రోజులపాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు పంచముఖ రుద్ర మహాగణపతికి పూజలు నిర్వహించారు. అనంతరం నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.