పొలిటికల్ ఎంట్రీ ప్రశ్నపై గంగూలీ స్పందన..
కోల్‌కతా (CLiC2NEWS):రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని బిసిసిఐ మాజి చీఫ్, మాజి క్రికెటర్ సౌరవ్ గంగూలీ తనకు ఎదురైన పొలిటికల్ ఎంట్రీ ప్రశ్నపై స్పందించారు. గతంలో కూడా అనేకసార్లు గంగూలీ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు చేలరేగాయి. అయినా వాటన్నిటినీ ఆయన ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చారు. తాజాగా మరోసారి పొలిటికల్ ఎంట్రీపై ఎదురైన ప్రశ్నకు రాజకీయాల్లోకి చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పిటిఐకి ఇచ్చిన పాడ్ కాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో గంగూలీ రాజకీయ అరంగేట్రం గురించి తాజాగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రానున్ననేపథ్యంలో ఏదైనా పార్టీలో చేరాలనుకుంటున్నారా .. అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన నాకు ఆసక్తి లేదు అని సమాధానం ఇచ్చారు. ఒక వేళ సిఎం పదవి ఇస్తానని హామీ ఇస్తే.. అంటూ మరో ప్రశ్న అడగగా.. నాకు ఆసక్తి లేదు అని తేల్చి చెప్పారు.