కోనసీమ: బోరు నుండి వాటర్‌కి బదులుగా గ్యాస్, అగ్నీకీలలు..

అమలాపురం (CLiC2NEWS): కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు నుండి గ్యాస్, అగ్నికీలలు ఎగసి పదుతున్నాయి. 20 అడుగుల ఎత్తు వరకు గ్యాస్ ఎగసిపడుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. అక్వా చెరువులో నీటి కోసం ఆరేళ్ల కిందట బోర వేశారు. రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారు. అయితే ఈ ప్రదేశంలో గ్యాస్ కోసం గతంలో సెస్మిక్ సర్వే జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భూమిలోని గ్యాస్ బయటికి వచ్చి.. మంటలు వస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైప్‌లైన్ అయితే గ్యాస్‌ను అదుపు చేయొచ్చని, కానీ భూమినుండి నిరంతరం గ్యాస్ వస్తుండటంతో మంటలు అదుపుచేయడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు.