లూథియానాలో గ్యాస్ లీక్.. 11 మంది మృతి
లూథియానా (CLiC2NEWS): పంజాబ్లోని లూథియానాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక గియాస్పుర ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు పిల్లలతో సహా 11 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో పది మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ ఎలా లీక్ అయింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్ లీక్ వివరాలు తెలుసుకున్న ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటన పై సిఎం భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.