సిఎం జగన్‌తో గౌతమ్ ఆదానీ భేటీ

అమరావతి (CLiC2NEWS): దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో పలువురు ప్రముఖుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీ, బిసిజి గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. సిఎంతో గౌతమ్ ఆదానీ వివిధ అంశాలపై చర్చించారు. వీరితో పాటు వరల్డ్ ఎకానామిక్ ఫోరం (WEF) మొబిలిటీ, సస్టైనబిలిటి విభాగాధిపతి పెట్రో గొమేజ్, హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ బిషేన్ తో సిఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్య రంగంపై చర్చించినట్లు సమాచారం. అనంతరం WEFతో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకున్నారు.