కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్‌తో ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి భేటి

న్యూఢిల్లి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌తో భేటి అయ్యారు. గౌతమ్ రెడ్డి ఢిల్లి పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటి అయ్యారు. ఎపిలోని మున్నవరం, రొప్పర్తి పారిశ్రామిక వాడలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని గౌతమ్ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. కోల్ ఇండియా, పవర్ మినిస్ట్రీ సహకారంతో 3 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్రమంత్రికి తెలియజేసినట్లు మంత్రి పేర్కొన్నారు.