రాజ్యసభ టిఆర్ఎస్ సభ్యుడిగా గాయత్రి రవి ఏకగ్రీవం

హైదరాబాద్ (CLiC2NEWS): రాజ్యసభ టిఆర్ ఎస్ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వద్ది రాజు రవిచంద్ర ఎన్నిక పత్రాన్ని స్వీకరించారు. రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్లు ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. సమాజ్వాదీ పార్టీకి చెందిన జాజుల భాస్కర్, స్వతంత్ర అభ్యర్థి భోరజ్ కొయాల్కర్ నామినేషన్లు పరశీలించిన ఎన్నికల అధికారి వారి నామినేషన్లు సక్రమంగా లేని కారణంగా వాటిని తిరస్కరించారు. దీంతో పోటీ లేకపోవడంతో వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.