ఎన్‌టిపిసి, న్యూఢిల్లీలో జిడిఎంఒ/ మెడికల్ పోస్టులు

NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ న్యూఢిల్లీలో జిడిఎంఒ/ మెడికల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 81 పోస్టులు ఉన్నాయి. వీటిలో జిడిఎంఒ పోస్టులు 20 ఉండగా.. మిగిలినవి మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు.
మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు – 61
ఫిజిషియన్ – 25
పిడియాట్రిక్ -10
రేడియాలజిస్ట్ -4
ఆర్ధోపెడిక్స్-6
ఆఫ్తల్మాలజిస్ట్ -4
ఒ అండ్ జి- 10
ఇఎన్‌టి -2
ఈ పోస్టులకు దరఖాస్తుల షార్ట్ లిస్ట్ / విద్యార్హతలు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ లోపు పంపించాలి. దరఖాస్తు ఫీజు రూ.300గా నిర్ణయించారు. ఎస్‌సి , ఎస్ టి దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 37 ఏళ్లకు మించకూడదు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు.. ఒబిసిలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఎంబిబిఎస్, ఎండి/ డిఎన్‌బి, ఎంఎస్, పిజి డిప్లొమా ఉత్తీర్ణులై ఉండటంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
జిడిఎంఒ పోస్టులకు నెలకు వేతనం రూ. 50 వేల నుండి రూ.1.60లక్షల వరకు ఉంటుంది. మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు నెలకు వేతనం. రూ. 70వేల నుండి రూ. 1,80,000 వరకు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ntpc.co.in వెబ్‌సైట్ చూడగలరు.