జలమండలి కార్యాలయంలో ఘనంగా ఏక్తా దివాస్

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో ఉన్న జలమండలి కార్యాలయంలో ఏక్తా దివాస్ ఘనంగా నిర్వహించారు. సోమవారం జలమండలి అధికారులు, సిబ్బంది ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి జలమండలి పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు హాజరై.. ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశానికి ఎంతగానో సేవ చేయడంతో పాటు దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏక్తా దివాస్‌గా జరుపుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దేశ సమగ్రత, భద్రతకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని, దేశ ఐక్యత, అభివృద్ధి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.