కాంగ్రెస్‌కు మరోషాక్.. గులాం నబీ ఆజాద్ రాజీనామా
ఢిల్లీ (CLiC2NEWS): సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన అధిష్ఠానానికి లేఖ పంపారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఆజాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ రాకతోనే పార్టీ నాశనం మొదలైందంటూ.. పరిణతిలేని నాయకత్వంతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఆజాద్ నాలుగు పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.