ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఇవ్వండి.. రుచిక‌ర‌మైన భోజ‌నం అందిస్తాం..

ఓ ఏఫ్ వినూత్న ప్ర‌క‌ట‌న

గుజ‌రాత్ (CLiC2NEWS): దేశమంతా జులై 1 వ‌తేదీ నుండి ప‌లు ప్లాస్టిక్ వ‌స్తువుల‌పై నిషేధం అమ‌లులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో గుజ‌రాత్‌లోని ఓ కేఫ్ వినూత్న ప్ర‌క‌ట‌న చేసింది. ప్లాస్టిక్ వ్య‌ర్థాలు అంద‌జేస్తే.. రుచిక‌ర‌మైన భోజ‌నం అందిస్తామంటూ ప్ర‌జ‌ల‌ను దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఆహార ప‌దార్థాల‌ను కొనుగోలు చేసేస‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్లు బిల్లును డ‌బ్బు రూపంలో చెల్లించేబ‌దులు.. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను ఇచ్చినా.. స్వీక‌రిస్తామంటూ తాజాగా ప్ర‌క‌ట‌న చేసింది. గుజ‌రాత్‌లోని జునాగ‌ఢ్‌కు చెందిన‌ నేచుర‌ల్ ప్లాస్టిక్ కేఫ్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

ఒక‌సార్ఇ వాడిపారేసే ప్లాస్టిక్ వ‌స్తువుల‌పై జులై 1 నుండి దేశ‌వ్యాప్తంగా కేంద్రం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా త‌క్కువ ప‌రిమాణం క‌లిగిన ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను త‌యారు చేయ‌డం, దిగుమంతి చేసుకోవ‌డం, నిల్వ ఉంచుకోవ‌డం, స‌ర‌ఫ‌రా, అమ్మ‌కంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్న‌ట్లు కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.