మూసీ ప్రక్షాళనకు రూ.4 వేలకోట్లు ఇవ్వండి: సిఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ (CLiC2NEWS): మూసీ ప్రక్షాళనకు రూ.4 వేలకోట్లు ఇవ్వాలని రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు సోమవారం కేంద్ర మంత్రులు పాటిల్, ప్రహ్లాద్ జోషిలతో సమావేశమయ్యారు. ముందుగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సిఆర్ పాటిల్ వీరు భేటి అయ్యారు. ఈ సందర్భంగా .. మూసి ప్రక్షాళనకు రూ. 4 వేల కోట్లు, గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమయాత్ సాగర్ జలాశయాల్లో నింపే పనులకు రూ. 6 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంఓల 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని, కనెక్షన్లు ఇచ్చేందుకు రూ. 16,100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం జల్ జీవన్ మిషన్ నిధులు విడుల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించిన కేంద్ర నుండి రావాల్సిన బకాయిలను విడుదలచేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం.