జిఒ 29 ఉపసంహరించుకోవాలి: మంత్రి బండి సంజయ్

హైదరాబాద్ (CLiC2NEWS): నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదన అర్ధం చేసుకోమని సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. జిఒ 29ని ఉపసంహరించాలని గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పంతాలు , పట్టింపులకు పోకుండా జిఒ 29ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. సోమవారం పరీక్షలని తెలిసి కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారంటే అర్ధం చేసుకోమని, వెంటనే గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయమని కోరారు. జిఒ 29 వలన గ్రూప్-1 పరీక్షల్లో 5 వేల మంది ఎస్‌టి, ఎస్‌సి, బిసి అభ్యర్థులు అనర్హులయ్యారని లేఖలో పేర్కొన్నారు.
గ్రూప్-1 పోస్టులు మొత్తం 563 ఉండగా.. మెయిన్స్ పరీక్షలకు 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయన్నారు. ఈ పోస్లుల్లో 354 రిజర్వు పోస్టులు ఉన్నాయని, జిఒ 29వల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరిలో చేర్చడం అన్యాయమన్నారు. దీనివల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసి అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఒసి వర్గాలు 1:65 శాతం మేర అర్హత సాధించాయి. జిఒ 29 రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేఖమన్నారు. ఈ జిఒ వలన రాష్ట్రంలో రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని, తక్షణమే జిఒ 29 ఉపసంహరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలతో మాట్లాడే బదులు మాతో మాట్లాడండి.. గ్రూప్-1 అభ్యర్థుల ఆవేదన