భద్రాచలం నుండి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం (CLiC2NEWS): భద్రాచలం ఇటీవల కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా వరద నీటితో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. శనివారం గోదావరి నీటిమట్టం 34 అడుగులు ఉండగా.. ఆదివారం సాయంత్రానికి 43 అడుగులకు చేరినట్లు సమాచారం.
భద్రాచలం నుండి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలక వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు చేరుకుంది. చట్టి వద్ద ప్రధాని రహదారిపై భారీగా వరదనీరు చేరడంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం సమీపంలో 163 నెంబర్ జాతీయ రహదారిపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. చర్ల మండలం వద్ద ఈత వాగు పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో నాలుగు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం స్నాన ఘట్టాల వద్ద చాలావరకు మెట్లు నీటిలో మునిగిపోయాయి.