రూ.6.66 కోట్ల నోట్లతో అలంకరించిన అమ్మవారు

మహబూబ్నగర్ (CLiC2NEWS): శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారి ఆలయాలు వివిధ అలంకరణలతో భక్తులను కనువిందు చేస్తున్నాయి. రోజుకొక అవతార అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారిని ఆదివారం రూ. 6,66,66,666 విలువైన నగదుతో మహాలక్ష్మిగా అలంకరించారు. ఆర్యవైశ్య సభ్యులు రూ.10, 20, 50, 100, 200, 500 నోట్లతో అమ్మవారిని , ఆలయాన్ని అలంకరించారు. మహాలక్ష్మిగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన కళాకారులతో ఈ అలంకరణ చేయించినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తెలిపారు.