కొమురవెల్లి మల్లన్నకు బంగారు కిరీటం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/komaravelli-mallanna-kalyanam.jpg)
కొమురవెల్లి (CLiC2NEWS): కొమరవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. మల్లన్న కాల్యాణం కన్నులారా వీక్షించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ కల్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మల్లన్న స్వామికి రూ. కోటి విలువ గల బంగారు కిరీటాన్ని, పట్టు వస్త్రాలను మంత్రి హరీశ్‌రావు సమర్పించారు.