Commonwealth Games: తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌కు స్వర్ణం..
బర్మింగ్‌హామ్ (CLiC2NEWS): కామన్ వెల్త్ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి నిఖత్‌జరీన్ 48-50 కేజీల (లైట్‌ప్లై) విభాగంలో పసిడి పతకం సాధించింది. నార్తన్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై విజయం సాధించి భారత్‌కు 17వ స్వర్ణం అందించింది. దీంతో 5వ స్థానంలో ఉన్న భారత్ 4వ స్థానానికి ఎగబాకింది. మొత్తం 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సాధించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో నిఖత్‌జరీన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.