సామాన్యుడికి అందని ద్రాక్ష.. రూ.83వేలు దాటిన బంగారం ధర

ఢిల్లీ (CLiC2NEWS): బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 83,100కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే దీనికి కారణమంటున్నారు. 99.9 స్వచ్ఛమైన బంగారం ధర రూ. 83,100 కాగా.. 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.82,700కి చేరింది. దీంతో పాటు వెండి ధర కూడా పెరుగుతూ వస్తూంది. కిలో వెండి ధర రూ. 94వేలకు చేరింది. క్రితం ట్రేడింగ్‌లో దీని ధర రూ.93,500 గా ఉండగా.. తాజాగా రూ.94వేలకు చేరుకుంది.