భారీగా తగ్గిన బంగారం ధర..

హైదరాబాద్ (CLiC2NEWS): బంగారం ధర భారీగా దిగివచ్చింది. ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో బంగారానికి రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. 10గ్రా పసిడి ధర రూ.లక్ష దాటి.. క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గింది అమెరికా-చైనా మధ్య టారిఫ్‌లకు 90 రోజుల పాటు బ్రేక్ పడటంతో బంగారం రేటు తగ్గుముఖం పట్టింది. దీంతో ఢిల్లీలో పసిడి ధర రూ.3400 వరకు తగ్గి రూ.96,550కి చేరింది. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ పసిడి ధర రూ.99,950 ఉండగా.. ప్రస్తుతం రూ.96,125కు చేరింది. కిలో వెండి ధర రూ. 200 మేర తగ్గి.. 99,700 గా ఉంది.