పసిడికి రెక్కలు.. భారీగా పెరిగిన బంగారం ధర
ఢిల్లీ (CLiC2NEWS): బంగారం ధర రోజురోజుకూ పెరుగుతుంది. సోమవారం మరోసారి భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా ధర పెరగడంతో దేశంలో కూడా బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఒక్క రోజులో రూ. 1400 పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. య61,100కు చేరింది. ఇదే విధంగా వెండి ధర రూ 1800 పెరిగి రూ.69,340 కి చేరింది. పదిరోజుల వ్యవధిలో రూ.56 వేల నుండి రూ.60వేల స్థాయికి పెరిగింది. ఇటీవల బ్యాకింగ్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు కారణంగా బంగారం ధరలో మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2005 డాలర్లు ఉంది. ఇది గత సంవత్సరం మార్చిలో 2052 డాలర్లు పలికింది.