కానిస్టేబుల్(GD) పోస్టుల సంఖ్య 50,187కి పెంపు

ఢిల్లీ (CLiC2NEWS): కానిస్టేబుల్/ రైఫిల్ మ్యాన్ (GD) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన స‌మ‌యంలో పేర్కొన్న పోస్టుల సంఖ్య‌ను ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు స‌వ‌ర‌ణ చేశారు. తాజాగా మ‌రోసారి ఆ సంఖ్యు 50,187కి పెంచిన‌ట్లు స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌(SSC) ప్ర‌క‌టించింది. కేంద్ర సాయుధ బ‌ల‌గాలైన బిఎస్ ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌, ఎస్ ఎస్ ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ (GD) రైఫిల్ మ్యాన్ (GD) ఉద్యోగాల భ‌ర్తీకి ఎస్ ఎస్ సి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి.. జ‌న‌వ‌రి నెల‌లో ఆన్‌లైన్‌లో ఎక్జామ్ నిర్వ‌హించింది.

కేంద్ర సాయుధ బ‌ల‌గాల (CAPF) కానిస్టేబుల్ ఉద్యోగ ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో్ మొత్తం ఖాళీల సంఖ్‌య 24,369గా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఆ పోస్టుల సంఖ్యను 45,284కు పెంచారు. మ‌ళ్లీ ఈ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రిలో 1,151 ఖాళీల‌ను క‌ల‌ప‌డంతో ఆ పోస్టుల సంఖ్‌య 46,435కి చేరింది. ఇపుడు తాజాగా మ‌రోసారి 3,257 పోస్టులను క‌ల‌ప‌డంతో మొత్ం ఖాళీల సంఖ్య 50,187కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.