పసిడి ధర రూ.80వేలు.. రూ.లక్ష చేరిన కిలో వెండి

హైదరాబాద్ (CLiC2NEWS): పసిడి ధర రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా స్వచ్ఛమైన బంగారం ధర రూ. 80వేలు దాటింది. 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ. 80,500కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర తొలి సారిగా రూ. లక్షకు చేరింది.