రూ.94వేలకు చేరుకున్న పసిడి ధర..

ఢిల్లీ (CLiC2NEWS): బంగారం ధర కొత్త రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.94,150కి చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం దాదాపు 180% పెరిగింది. శుక్రవారం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150 ఉండగా.. శనివారం రూ.2 వేలు పెరిగి రూ.94,150కి చేరింది. అంతర్జాతీయ డిమాండ్ పెరగడంతో బంగారానికి రెక్కలు వస్తున్నాయంటున్నారు.
ఈ ఏడాది జనవరి 1వ తేదీన 99.9 స్వచ్ఛమైన పసిడి ధర రూ. 79,390 గా ఉంది. ప్రస్తుతం తాజా పెరుదలతో కలుపుకొని దాదాపు రూ.15 వేలు పెరిగింది. మరోవైపు వెండి ధర రూ. 1,020,500గా ఉంది.